AP EAPCET 2026 Results | ఈఏపీసెట్‌లో విద్యార్థినులదే పైచేయి
AP EAPCET 2026 Results | ఈఏపీసెట్‌లో విద్యార్థినులదే పైచేయి
AP EAPCET 2026 Results |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్)-2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,82,317 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఉత్తీర్ణత శాతం 70.52గా నమోదైంది. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లలో 63,546 మంది అభ్యర్థులు అర్హత పొందగా, ఉత్తీర్ణత శాతం 89.59గా నమోదైంది.
ఇంజినీరింగ్ విభాగంలో 71.65 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థినులు ముందంజలో నిలవడం గర్వకారణమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. వారి విజయం రాష్ట్ర భవిష్యత్తుకు బలమని ఆయన అన్నారు.
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే ర్యాంకుల ఆధారంగా త్వరలో నిర్వహించనున్న కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
