పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి
పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి
వినుకొండ, ఆంధ్రప్రభ : సీఎం సహాయనిది పేదల పాలిటి పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ సీనియర్ శాసనసభ్యుడు జీవీ.ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 74 మంది లబ్ధిదారులకు 63 లక్షల 54 వేల రూపాయల చెక్కులను బుధవారం తన కార్యాలయంలో పంపిణీ చేశారు.
వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు, తమకు అందేలా కృషిచేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీకి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
