lockup death case | సిట్ దర్యాప్తులో కీలక పరిణామం
lockup death case | సిట్ దర్యాప్తులో కీలక పరిణామం
lockup death case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్ట్ చేశారు.
అరెస్టు అనంతరం ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన సిట్ అధికారులు వారిని జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇరువురు కానిస్టేబుళ్లకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం, వారిని అవనిగడ్డ జైలుకు తరలించాలని ఆదేశించింది.
సిట్ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. బాబురావు, సాంబయ్యలు కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లను మార్చి, వాటి స్థానంలో ఇతర హార్డ్‌డిస్క్‌లను అమర్చడం ద్వారా ఆధారాలను మాయం చేసినట్లు పేర్కొంది.
అలాగే, సాయికృష్ణ మృతదేహం ఇప్పటికీ ఎక్కడ ఉందో తెలియలేదని, అరెస్టైన నిందితులు విచారణకు సహకరించడం లేదని, దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సిట్ కోర్టుకు వివరించింది. నిందితులు పోలీసు సిబ్బంది కావడంతో సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.
