Shashank Singh Case | శశాంక్, తండ్రిపై దాడి ఆరోపణలు
Shashank Singh Case | శశాంక్, తండ్రిపై దాడి ఆరోపణలు
Shashank Singh Case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న క్రికెటర్ శశాంక్ సింగ్, ఆయన తండ్రి విశ్రాంత స్పెషల్ డీజీపీ శైలేష్ సింగ్‌పై భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విపేంద్ర సింగ్ తోమర్ అనే వ్యక్తి ఇటీవల శశాంక్ ఇంట్లో వంట మనిషిగా చేరినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉచిత వసతి, భోజనం, నెలకు రూ.15 వేల వేతనంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపాడు.
అయితే వంటల నాణ్యత బాగాలేదంటూ శశాంక్ సింగ్, ఆయన తండ్రి, మరో వ్యక్తి తనను తరచూ దూషించేవారని ఆరోపించాడు. దీంతో ఉద్యోగం మానేస్తానని చెప్పగా అంగీకరించకుండా తనపై దాడి చేశారని, మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు భోపాల్ పోలీసులు వెల్లడించారు. ఈ ఆరోపణలపై శశాంక్ సింగ్ లేదా ఆయన కుటుంబ సభ్యుల స్పందన వెలువడాల్సి ఉంది.

