ప్రజావాణిలో 8 అర్జీల స్వీకరణ..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకన్న అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 8 అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, వాటిని నిర్ణీత గడువులోగా పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకన్న అధికారులను ఆదేశించారు.