indrakeeladri29thjune | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
indrakeeladri29thjune | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
56 వేలకు పైగా దర్శనాలు
ఉచిత దర్శనం ద్వారా అత్యధికంగా 29,361 మంది అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
అన్నప్రసాదాన్ని స్వీకరించిన 11,150 మంది.. రూ.100, రూ.300, రూ.500 దర్శనాలకు విశేష స్పందన
indrakeeladri29thjune | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారిని ఆదివారం (జూన్ 28) భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి మొత్తం 56,041 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఉచిత దర్శనం ద్వారా అత్యధికంగా 29,361 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, రూ.100 దర్శనం ద్వారా 9,347 మంది, రూ.300 దర్శనం ద్వారా 8,757 మంది, రూ.500 ప్రత్యేక దర్శనం ద్వారా 8,547 మంది స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయంలో అన్నప్రసాదానికి కూడా విశేష ఆదరణ లభించింది. ఉదయం 8,800 మంది, రాత్రి 2,350 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మొత్తం 11,150 మందికి ఆలయ అధికారులు అన్నప్రసాదం అందించారు.
సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనాలు, అన్నప్రసాద పంపిణీ, క్యూలైన్ల నిర్వహణను సజావుగా చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
