అక్కకొండ ఆలయ కోనేరు పునరుద్ధరణ పనులకు శ్రీకారం..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని దిల్దార్‌నగర్ గ్రామ సమీప అరణ్య ప్రాంతంలో కొండగుహపై వెలసిన శ్రీ అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరు పునరుద్ధరణ పనులను సోమవారం ప్రారంభించారు.

జల్ శక్తి అభియాన్ పథకం కింద నిర్మల్ జిల్లా కలెక్టర్ ద్వారా రూ.16 లక్షల నిధులు మంజూరు కావడంతో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు కొండాడి జగ్గారావు, చైర్మన్ కొప్పుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో దిల్దార్‌నగర్, ఏలగడప, సారంగాపూర్ గ్రామాల సర్పంచులు బద్దనపల్లి స్టీఫెన్, కోల తేజస్విని-శ్రీనివాస్, నర్సింగ్, అశ్విత-రమేష్, కడెం ఈజీఎస్ ఏపీఓ జయదేవ్, టీఏ గణేష్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి తోడిశెట్టి లక్ష్మీరాజం, కోశాధికారి మార్గపు లక్ష్మణ్, సభ్యులు రాపర్తి పెద్ద లక్ష్మణ్, ఈజీఎస్ ఎఫ్‌ఏ వసంత, నాయకులు ఏపూరి రాజ్‌కుమార్, చరణ్, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.