పేదల సొంతింటి కల సాకారం
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట వీధికి చెందిన బెస్త రేణుక–నరసింహ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఎం. రేణుక భరత్, ఉపసర్పంచ్ రమేష్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం మహేష్ రెడ్డి, స్థానిక నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు నాణ్యమైన ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఆశాకిరణంగా నిలిచిందని మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన సహకారానికి గృహ యజమానులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
