పోలియో నిర్మూలనలో భాగస్వాములవ్వాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు కోరారు.డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం డాక్టర్ సుగుణాకర్ రాజు ప్రారంభించారు. చిన్నారులకు పల్స్ పోలియో డ్రాప్స్ వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. చిన్నారులకు రెండు చుక్కలు వేసి పోలియో రహిత సమాజం నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

సమీపంలోని కేంద్రాలకు చిన్నారులను తీసుకువచ్చి చుక్కలు వేయించాలని తెలిపారు. చిన్నపాటి జలుబు,దగ్గు,జ్వరం ఉన్న పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించవచ్చన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు.పోలియో అనేది శాశ్వత అంగవైకల్యానికి కారణమయ్యే ప్రమాదకర వ్యాధి అని,రెండు చుక్కలతో మన పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇవ్వవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్,వైద్యులు డాక్టర్ మానస,సిబ్బంది సుందరి శ్రీరాములు,ప్రమీళ,రోజా,సృజన, పద్మావతి,వనజ తదితరులు పాల్గొన్నారు.