రూ.5 లక్షల రైతు భీమా చెక్కు పంపిణీ..
వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన వద్దాజీ లక్ష్మి నారాయణకు కు రైతు భీమా పథకం కింద లబ్ధిదారునికి విలువైన రూ.5 లక్షల ఆర్థిక సహాయం రైతు భీమా ప్రొసీడింగ్‌ను సర్పంచ్ నల్ల రాజు ఆదివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ నల్ల రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సకాలంలో అందుతున్నాయని, రైతులు ఎలాంటి సందేహాలున్నా తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, వసంత్ రావు, బొంబాయి గంగాధర్, రంజిత్, వెంకటరమణ,గైని గంగాధర్, బడ్కల చిన్నన్న,మురళి, తదితరలు పాల్గొన్నారు.
