పోలియో రహిత సమాజమే మన లక్ష్యం..

పోలియో రహిత సమాజమే మన లక్ష్యం..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : పోలియో రైతు సమాజమే మన లక్ష్యం అనే నినాదంతో అందరం కలిసి ముందుకు వెళ్ళాలని ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద కోరారు. ఆదివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ స్థానిక మేజర్ గ్రామ పంచాయతీలో ఉట్నూర్ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ తో కలిసి గ్రామ పంచాయతీ ఉట్నూర్ కార్యాలయం నందు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పోలియో ఒక ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ, పోలియో చుక్కల ద్వారా దీనిని పూర్తిగా నివారించవచ్చు. ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి ప్రభుత్వం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని . ఒక్క చిన్నారిని కూడా వదలకుండా అందరికీ ఈ రక్షణ అందేలా తల్లిదండ్రులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది అందరు కలిసి పనిచేయాలి. అని అందరి సహకారంతోనే పోలియో రహిత, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలం అని ప్రతి చిన్నారి ఆరోగ్యం మన అందరి బాధ్యత అని ఇట్టి సందర్భంగా తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో ఉట్నూర్ ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమేత మనోహర్, ఉట్నూర్ ఈవో శంకర్, వైద్య ఉద్యోగులు ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.