పోలియో రహిత సమాజమే లక్ష్యం….

పోలియో రహిత సమాజమే లక్ష్యం….

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి….

బిక్కనూర్, ఆంధ్రప్రభ : పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యం అని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోనిరామేశ్వర్ పల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. పోలియో చుక్కల మందు వేయించడంలో ఎవరు నిర్లక్ష్యం చేయవద్దన్నారు. పోలియో రహిత సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉప సర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, సొసైటీ చైర్మన్ నాగర్తి భూమ్ రెడ్డి, పాలకేంద్రం అధ్యక్షులు తక్కల్ల రవీందర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, వార్డు సభ్యులు మద్ది కృష్ణారెడ్డి, పనాస రాజు, ఏఎన్‌ఎం మాధవి, ఆశా వర్కర్లు కీర్తి, రేణుక, సంగీత, చిన్నారులు, తల్లిదండ్రులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.