వైజాగ్ గ్రాండ్ విక్టరీ

అర్థ శతకంతో మెరిసిన హిమకర్
బౌలింగ్లో అదరగొట్టిన కామిల్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కామిల్

ఆంధ్రప్రభ విజయవాడ : ఏపీఎల్ 2026 సీజన్ 5 లో భాగంగా మంగళగిరి వేదికగా నాలుగవ రోజు జరిగిన తొలి మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్ జట్లు తలపడ్డాయి మొదటగా టాస్ గెలిచిన తుంగభద్ర వారియర్స్ మొదటిగా ఫీల్డింగ్ ఎంచుకుంది మొదట బ్యాటింగ్ కు దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు ఓపెనర్ హిమకర్ బౌండరీలతో మంచి స్టార్ట్ ను అందించాడు 30 బంతుల్లో 52 పరుగులు 5ఫోర్లు 4సిక్సులు తో పవర్ఫుల్ స్టార్ట్ ను అందించిన మిగతా బ్యాటర్లు ఎవరు పెద్దగా రాణించలేదు దీనితో 20 ఓవర్ల లో 161 పరుగులకు వైజాగ్ జట్టు ఆల్ అవుట్ అయ్యింది.

తుంగభద్ర బౌలర్ల లో బ్రహ్మ తేజ 3 వికెట్స్, మిగిలిన బౌలర్లు తలో వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగిన తుంగభద్ర జట్టు ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ జట్టును ఆదుకోవడంతో లక్ష్యం చెరువు వరకు వెళ్లినా గెలుపు సాధ్యపడలేదు. తుంగభద్ర బ్యాటర్లలో గుత్తా రోహిత్ 39 బంతుల్లో 60 పరుగులు 4 ఫోర్లు 4 సిక్సర్లతో, సౌరబ్ కుమార్ 40 బంతుల్లో 34 పరుగులు 4 ఫోర్లతో పోరాడిన టీంకు విజయం దక్కలేదు దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే తుంగభద్ర జట్టు చేయగలిగింది దీనితో సింహాద్రి వైజాగ్ లైన్స్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది వైజాగ్ బౌలర్లలో కామిల్ 3 వికెట్లు పడగొట్టగా ప్రమోద్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కామిల్ ఎంపికయ్యాడు