చేంగల్‌లో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

గ్రామ సర్పంచ్ దుమాల మమత, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు దుమాల రాజుతో పాటు స్థానిక నాయకులు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహాయంతో తమ కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించిందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఏఎంసీ డైరెక్టర్ నర్సాపురం జీవన్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆర్మూర్ రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడపా రాజేశ్వర్, నూతుల వసంత్, నూతుల రమేష్, తూర్పు శ్రీధర్, శోభన్ గౌడ్, ఆనంద్ గౌడ్, బాబా గౌడ్, థక్కురి లింబద్రి, ప్రశాంత్ గౌడ్, గిర్ణి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.