సర్ ఓటర్ సర్వేను పరిశీలించిన ఆర్డీవో
జైనూర్/ సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : సర్ ఓటర్ సవరణ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ఆసిఫాబాద్ ఆర్డిఓ లోకేశ్వరరావు అన్నారు. ఆయన శనివారం జైనూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సర్వే పారాల విషయంలో తాహసిల్దార్ ఆడబీర్షావ్ తో మాట్లాడారు అన్ని పోలింగ్ కేంద్రాలకు సర్వే పత్రాలు పంపించి ఓటర్లందరికి సర్వే పత్రాలు అందేలా చూడాలని ఆర్డిఓ కోరారు. అనంతరం సిర్పూర్ మండలంలోని రాగాపూర్ గ్రామపంచాయతీలో సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న ఓటర్ సర్వే ను పరిశీలించారు. సర్వే చేస్తున్న వారితో మాట్లాడుతూ సర్వే వారాలు ఎలా నింపాలని అవగాహన కల్పించారు. సర్ ఓటర్ సవరణ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ఆర్డీవో కోరారు. అర్హులైన ప్రతి ఓటర్ కు సర్వే పత్రాలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాగాపూర్ సర్పంచ్ ఆత్రం విజయలక్ష్మి బీర్షవ్, సిర్పూర్ (యు ) తాహ సిల్దార్ రాథోడ్ ప్రహ్లాద్, ఆర్ ఐ నవీన్, పంచాయతీ కార్యదర్శి అశోక్, జిపిఓ శ్రీనివాస్, బి ఎల్ ఓ ఆత్రం సునీత, కారోబర్ రాజేందర్, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
