నగర సమీపంలో ప్యాచ్ వర్క్స్

నగర సమీపంలో ప్యాచ్ వర్క్స్

వాహనాలు దారి మళ్లింపు…

హనుమకొండ, ఆంధ్రప్రభ : వరంగల్ జిడబ్ల్యూఎంసి పరిధిలోని వివిధ డివిజన్లలో ప్యాచ్ వర్క్స్ చేస్తున్నారు. అందువల్ల ట్రైసిటీ పరిధిలో వాహనాలు దారి మళ్లిస్తున్నారు. హనుమకొండ బస్టాండ్ సమీపం నుంచి కాళోజీ కళాక్షేత్రం, వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు దారి మళ్లించడంతో నగరంలోని పలు వీధుల్లో వాహనాలు తిరగడంతో హడావిడి మొదలైంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వీధుల్లోని నివాసులంతా వాహనాల రాకపోకల కారణంగా భయబ్రాంతులు చెందుతున్నారు.