షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషికి ఘన స్వాగతం..
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గంజాల్ టోల్‌ప్లాజా వద్ద తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీఎంఆర్ఈఐఎస్ (TMREIS) వైస్ చైర్మన్ ఫహీం ఖురేషికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్ ఇమ్రానుల్లా తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ, పార్టీని సమష్టిగా బలోపేతం చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
