TG CPGCET 2026 | టీజీ సీపీజీఈటీ పరీక్షల షెడ్యూల్ విడుదల
TG CPGCET 2026 | టీజీ సీపీజీఈటీ పరీక్షల షెడ్యూల్ విడుదల
జూలై 8 నుంచి 15 వరకు కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలు
రోజుకు మూడు సెషన్లలో నిర్వహణ.. త్వరలో హాల్టికెట్లు విడుదల
TG CPGCET 2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ సీపీజీఈటీ)-2026 పరీక్షల షెడ్యూల్ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 8 నుంచి 15 వరకు రోజుకు మూడు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్ష 90 నిమిషాల వ్యవధిలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ), కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ), జేఎన్టీయూహెచ్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయం సహా రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్, ఇతర వివరాలు, హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
