కౌతవరం పీఏసీఎస్‌లో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం..

  • ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ : గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ఆర్వో వాటర్ ప్లాంట్‌ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం ఉదయం ప్రారంభించారు.

ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము, సంఘ సభ్యులతో కలిసి వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్లాంట్‌ను పరిశీలించి నీటి నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, “రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమున్నారు. పీఏసీఎస్‌లు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు కాదు, రైతులకు, గ్రామ ప్రజలకు బహుళ సేవలు అందించే కేంద్రాలుగా మారాలన్నారు. కౌతవరం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమున్నారు.

ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, టీడీపీ నాయకులు వల్లభనేని బాబురావు, చేకూరు జగన్మోహనరావు, బ్యాంక్ చైర్మన్ యుగంధర్, ఈడే కృష్ణ, దేశపతి, కొడాలి రామరాజు, బాబి, తూము పద్మజ, మల్లిపెద్ది సుబ్రమణ్యం, అరసవిల్లి శివ రాజేష్, వల్లభనేని రంగబాబు, జోజి, పిచ్చే ఈశ్వరరావు, గరికిపాటి బ్రదర్స్, సొసైటీ ఉద్యోగులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.