భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ఇదే
- హ్యారీ బ్రూక్ కెప్టెన్..
- యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్‌కు తొలి పిలుపు
- జూలై 1 నుంచి ఐదు మ్యాచ్‌ల సిరీస్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహించనుండగా, యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్‌కు తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కింది.
జూలై 1న చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తన బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. ఇటీవల ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జేమ్స్ కోల్స్ ఎంపిక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన సాకిబ్ మహ్మూద్ తిరిగి జట్టులోకి వచ్చాడు. జోర్డాన్ కాక్స్, సోనీ బేకర్ కూడా మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు.
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, జోర్డాన్ కాక్స్, జేమ్స్ కోల్స్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, రేహాన్ అహ్మద్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహ్మూద్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్, సోనీ బేకర్.
