Alliance Government | కూటమి ప్రభుత్వంపై అంబటి విమర్శలు..

Alliance Government | కూటమి ప్రభుత్వంపై అంబటి విమర్శలు..

హామీల‌ను విస్మ‌రించిన ప్ర‌భుత్వం

Alliance Government | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు.

ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.

నిరుద్యోగ భృతి, యువగళం సహా ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని, ఇది ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వమని అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పని ‘గోవిందా’ అయిందంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply