Chityala ఫర్టిలైజర్ కమిటీకి కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Chityala ఫర్టిలైజర్ కమిటీకి కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక


చిట్యాల (Chityala), ఆంధ్రప్రభ: మండల ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పువ్వాటి హరికృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా గుమ్మడ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా సర్వ రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మారెళ్ల దేవేందర్ రెడ్డి, బుర్ర రవీందర్, జయ్యారపు రవీందర్, కోశాధికారిగా జన్నెవేణు, సలహా కార్యదర్శులుగా తొట్ల ఐలయ్య, సట్ల కొండల్, లావుడ్య రాకేష్, జోగు భాను, మేకల శ్రీనివాస్ తదితరులు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పువ్వాటి హరికృష్ణ మాట్లాడుతూ, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ యజమానుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మండల రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు.

కమిటీకి అధికారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply