ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు..
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర SC సెల్ చైర్మన్, మానకొండూర్ నియోజకవర్గ శాసన సభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి, ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా సేవలో ముందుండి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు.
