సేవా దృక్పథంతో ‘మన చంద్ర ఫౌండేషన్’ ప్రారంభం
సేవా దృక్పథంతో ‘మన చంద్ర ఫౌండేషన్’ ప్రారంభం
- మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్
వికారాబాద్, ఆంధ్రప్రభ:
మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ‘మన చంద్ర ఫౌండేషన్’ను ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బృంగి ఇంటర్నేషనల్ స్కూల్లో డాక్టర్ చంద్రప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మన చంద్ర ఫౌండేషన్’ లోగోను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, తాను గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. తనను వరుసగా ఐదుసార్లు గెలిపించి ఆదరించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో తన కుమార్తె డాక్టర్ చంద్రప్రియ ముందుకు వచ్చి ‘మన చంద్ర ఫౌండేషన్’ను స్థాపించడం సంతోషకరమన్నారు.
మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ఈ సంస్థ ప్రత్యేకంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తన కుమార్తె వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
కార్యక్రమంలో బృంగి విద్యాసంస్థల కార్యదర్శి ప్రమీల, డైరెక్టర్లు కుమారస్వామి, శివప్రసాద్, సీనియర్ న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి, లవకుమార్, మాధవరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామచంద్రయ్య, డాక్టర్ సాధు సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, అనిల్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
