గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల, ఆంధ్రప్రభ: గ్రామాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం చిట్యాల మండలంలోని అందుకుతండాలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు, రహదారులు, సైడ్ డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళా సంఘ భవనం, అంగన్‌వాడీ భవనం నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

రైతులకు పంటల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ, పంట అవశేషాలను కాల్చివేయకుండా భూసారాన్ని పెంపొందించే పద్ధతులను అనుసరించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply