ఈ నెల 10న గౌరవ రాజీవ్ రంజన్మిశ్రా పర్యటన
ఈ నెల 10న గౌరవ రాజీవ్ రంజన్మిశ్రా పర్యటన
ఈ సందర్శనను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 10న ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణా జిల్లా, మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు తదితర వర్గాల నుంచి అభిప్రాయాలు, సూచనలు, వినతిపత్రాలు స్వీకరిస్తారని తెలిపారు.
ఉదయం 11 గంటల నుంచి వ్యక్తులు, సంస్థలు, సంఘాలు బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల ప్రభావం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపై లిఖిత పూర్వక అభిప్రాయాలు ఛైర్మన్ వారికి లిఖిత పూర్వకంగా సమర్పించవచ్చన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సంబంధిత వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
