Peddi | వీకెండ్లో ‘పెద్ది’ దూకుడు
Peddi | వీకెండ్లో ‘పెద్ది’ దూకుడు
Peddi | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. వీకెండ్లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, నాలుగో రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా 292.5 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ షోలు, పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ లు అవగా, యూఎస్ఏ, యూకే, గల్ఫ్ లాంటి ఓవర్సీస్ మార్కెట్లలో మంచి ఓపెనింగ్స్ ఈ కలెక్షన్లకు కారణమయ్యాయి. రామ్ చరణ్ పెర్ఫామెన్స్, సినిమాలోని ఎమోషనల్ సీన్ల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’కి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వీకెండ్లో హౌస్‌ఫుల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్‌లు సినిమాకు బలంగా నిలిచాయి. తెలుగు వెర్షన్ వసూళ్లలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఓవర్సీస్లోనూ సినిమా స్థిరమైన కలెక్షన్లు రాబడుతోంది. రామ్‌చరణ్ మాస్ లుక్, నటన, సినిమాలోని ఎమోషనల్ సీన్స్‌పై సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా, రామ్‌చరణ్ స్టార్డమ్ ఓపెనింగ్స్‌కు ప్రధాన బలంగా నిలిచింది.
