బాధితులకు అండగా ఉంటాం
బాధితులకు అండగా ఉంటాం
-డాక్టర్ చంద్రప్రియ
వికారాబాద్, ఆంధ్రప్రభ: మర్పల్లి మండల కేంద్రంలో శనివారం నాడు హోటల్ పైకప్పు కూలి నలుగురు తీవ్ర గాయాలు పలక వారిని సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించగా సంబంధిత క్షతగాత్రులను మాజీమంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ కూతురు డాక్టర్ చంద్రప్రియ ఆదివారం నాడు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె వారి ఆరోగ్య పరిస్థితులను సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
స్వయంగా డాక్టర్ అయిన చంద్రప్రియ ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వారికి ఎటువంటి అవసరం ఉన్న తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ వంతుగా బాధితులకు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మర్పల్లి మండలం జరిగిన ఘటన దురదృష్టకరమని పాత భవనాలను ప్రభుత్వం వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చిరెడ్డి మరుపల్లి వాసులు తదితరులు పాల్గొన్నారు.
