దేవపూర్‌లో ‘అమ్మ పేరు మీద చెట్టు’ కార్యక్రమం
దేవపూర్‌లో ‘అమ్మ పేరు మీద చెట్టు’ కార్యక్రమం
మొక్కలు నాటిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం కాసిపేట మండలం దేవపూర్ గ్రామంలోని 11వ నెంబర్ బూత్‌లో ‘అమ్మ పేరు మీద చెట్టు’ (ఏక్ పేడ్ మా కే నామ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నూతనంగా కాసిపేట మండల ఇన్చార్జిగా నియమితులైన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రధాని పిలుపును అందుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దేవునూరి సంతోష్, మండల ఉపాధ్యక్షులు రామచందర్, పార్టీ నాయకులు పోలవేణి పోషన్న, సూత్రాల కార్తీక్, బాలాజీ, తోట సంతోష్, లింగయ్య, ఎస్. రమేష్, సంజీవ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
