Women’s T20 World Cup రంగం సిద్ధం.. లండన్‌లో కెప్టెన్స్ కార్నివల్

Women’s T20 World Cup రంగం సిద్ధం.. లండన్‌లో కెప్టెన్స్ కార్నివల్

  • వన్డే ప్రపంచకప్ తర్వాత టీ20 టైటిల్‌పై భారత్ కన్ను
  • హర్మన్‌ప్రీత్ సేనకు మరో చరిత్ర సృష్టించే అవకాశం
  • డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి న్యూజిలాండ్
  • లార్డ్స్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్

మహిళల క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్-2026కు రంగం సిద్ధమైంది. జూన్ 12 నుంచి జూలై 5 వరకు జ‌ర‌గ‌నున్న ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. అయితే, ఈ మెగా టోర్నీకి ప్రారంభానికి ముందు ఆదివారం లండన్‌లో ప్రత్యేకంగా “కెప్టెన్స్ కార్నివల్” నిర్వహించారు. టోర్నీలో పాల్గొనే 12 జట్ల కెప్టెన్లు ఈ కార్యక్రమంలో హాజరై అభిమానులను అలరిస్తున్నారు.

2009లో ప్రారంభమైన మహిళల టీ20 వరల్డ్ కప్ గత 17 ఏళ్లలో విశేషంగా విస్తరించింది. ఈసారి తొలిసారిగా 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి. లండన్‌లోని ప్రముఖ ప్రదేశాల మధ్య జరిగే కెప్టెన్స్ కార్నివల్‌తో టోర్నీకి అట్టహాసంగా తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ ఇంగ్లండ్‌లోని ఏడు వేదికల్లో జరగనుండగా, జూలై 5న ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కెప్టెన్స్ కార్నివల్‌ను ఐసీసీ డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Women's T20 World Cup

డిఫెండింగ్ ఛాంపియన్‌గా న్యూజిలాండ్

మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఆస్ట్రేలియా అయినప్పటికీ, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించి కివీస్ తమ తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. కాగా, ఇప్పటివరకు ఈ ట్రోఫీని కేవలం నాలుగు జట్లు మాత్రమే గెలిచాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ మాత్రమే టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి.

తొలి టీ20 ప్రపంచకప్ భారత్ క‌న్ను..

ప్రస్తుతం భారత మహిళల జట్టు అద్భుత ఆత్మవిశ్వాసంతో టోర్నీలోకి అడుగుపెడుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా 2025లో స్వదేశంలో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై ఫైనల్లో విజయం సాధించి తొలి ఐసీసీ టైటిల్‌ను అందుకుంది.

ఇప్పుడు అదే విజయాన్ని టీ20 ఫార్మాట్‌లోనూ పునరావృతం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరింది. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈసారి ఆ నిరాశను తుడిచిపెట్టి తొలి టైటిల్ సాధించాలని భారత జట్టు భావిస్తోంది.

Leave a Reply