సీనియర్ నాయకులకే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

సీనియర్ నాయకులకే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

బిక్కనూర్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక కమిటీ అధ్యక్షులు, కాచాపూర్ గ్రామ ఉపసర్పంచ్ బైండ్ల దశరథం కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత 30 సంవత్సరాలుగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. పార్టీకి వారు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు.

ప్రభుత్వం అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజా సమస్యలపై నాయకులు, కార్యకర్తలు నిరంతరం పోరాటం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. అలాంటి నాయకులను గుర్తించకపోవడం సమంజసం కాదని ప్రశ్నించారు. ఇప్పటికైనా గ్రామాల వారీగా ఉన్న సీనియర్ నాయకుల సేవలను గుర్తించి నామినేటెడ్ పదవుల్లో వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో ముందుండి పనిచేస్తున్న వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇతర పార్టీల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డ వారికే న్యాయం జరగాలని సూచించారు.

Leave a Reply