జన్నారం ఐటీఐ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా వై. రమేష్

జన్నారం ఐటీఐ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా వై. రమేష్

జన్నారం ఆంధ్రప్రభ:

మంచిర్యాల జిల్లా జన్నారం ఐటీఐ, ఏటీసీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా వై. రమేష్‌ను ఉన్నతాధికారులు నియమించారు. ఇప్పటివరకు ట్రైనింగ్ ఆఫీసర్ బి. రాములు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.బి. రాములను సిరిసిల్ల ఐటీఐకి బదిలీ చేయగా, మంచిర్యాల ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న వై. రమేష్‌ను జన్నారం ఐటీఐకి నియమించారు.

ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ, అధ్యాపకులు, సిబ్బంది సహకారంతో విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

Leave a Reply