Vikarabad | ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన మాజి మంత్రి కుమార్తె డాక్టర్ చంద్రప్రియ..
Vikarabad | ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన మాజి మంత్రి కుమార్తె డాక్టర్ చంద్రప్రియ..
- గాయపడిన అల్మాస్‌కు భరోసా
వికారాబాద్, ఆంధ్రప్రభ: మోమిన్‌పేట్ మండలం వెల్చల్ గ్రామానికి చెందిన అల్మాస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ కుమార్తె డాక్టర్ చంద్రప్రియ శనివారం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.
అల్మాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న డాక్టర్ చంద్రప్రియ, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం నిమ్స్ వైద్యులతో మాట్లాడిన ఆమె, అల్మాస్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. బాధితుడు త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
