క్రీజ్‌లో గిల్, పంత్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో భార‌త ఓపెన‌ర్‌ కేఎల్ రాహుల్(KL Rahul) అద్భుత సెంచ‌రీ చేశాడు. రాహుల్‌కు ఇది టెస్టుల్లో 12వ సెంచ‌రీ కావ‌డం విశేషం. రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్ల‌తో 100 ర‌న్స్ చేసి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 60.6 స్ట్ర‌యిక్ రేట్‌తో అత‌ను బ్యాటింగ్ చేశాడు. అయితే సెంచ‌రీ కొట్టిన వెంట‌నే రాహుల్ ఔట‌య్యాడు. కేఎల్ రాహుల్ తొలుత జైస్వాల్, ఆ త‌ర్వాత సాయి సుద‌ర్శ‌న్‌, గిల్‌తో మంచి భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. అయితే సెంచ‌రీ పూర్తి చేసుకున్న త‌ర్వాత క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔట‌య్యాడు. సెకండ్ డౌన్‌లో వ‌చ్చిన కెప్టెన్ గిల్ వేగంగా స్కోరు చేస్తున్నాడు. గిల్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఇత‌నికి పంత్ తోడ‌య్యాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ నిల‌క‌డ‌గా ఆడుతోంది. లంచ్ స‌మ‌యానికి ఇండియా 96 ప‌రుగులు చేసి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మ‌ళ్లీ టీ విరామ స‌మ‌యానికి ఇండియా రెండు వికెట్ల న‌ష్టానికి 209 ర‌న్స్ చేసింది. ఉద‌యం ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 24 ర‌న్స్ చేసి, రెండో సెష‌న్‌లో సాయి సుద‌ర్శ‌న్ 81 ర‌న్స్ చేసి నిష్క్రమించారు. ఇక మూడ‌వ సెష‌న్‌లో రాహుల్ ఔట‌య్యాడు.

Leave a Reply