Vaibhav Suryavanshi | సచిన్ రికార్డు బ్రేక్..
Vaibhav Suryavanshi | సచిన్ రికార్డు బ్రేక్..
15 ఏళ్లకే వైభవ్ టీ20లకు ఎంపిక
Vaibhav Suryavanshi |భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో జరగనున్న టీ20లకు ఈ యువ హిట్టర్ 15 ఏళ్ల వయసులోనే ఎంపికై చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున పిన్న వయసులో అరంగేట్రం చేయనున్న క్రికెటర్‌గా ఘనత వహించాడు. గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మీద ఉండేది. సచిన్ 16 ఏల్ల 205 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు వైభవ్ 15 ఏళ్లకే ఆ రికార్డను బ్రేక్ చేయనున్నాడు. 15 ఏళ్ల వయసులోనే జాతీయ స్థాయిలో టీ20 జట్టులో అవకాశం పొందిన వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సంచలన ప్రదర్శన చేశాడు. టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇతని ఫామ్ ఆధారంగానే జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న సిరీస్‌కు ఎంపిక చేశారు.
1989లో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా, వైభవ్ అంతకంటే చిన్న వయసులోనే ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్-2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి, అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడి అందరి దృష్టిని ఆకర్షించాడు. వైభవ్ ఆటతీరుపై సచిన్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అతడు కేవలం గుడ్డిగా బాదడం కాకుండా, బంతిని ముందుగానే పసిగట్టి అద్భుతంగా ఆడుతున్నాడని, అతడి సహజమైన ఆటను మార్చకూడదని సచిన్ అభిప్రాయపడ్డారు.

