కుర్చపల్లిలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
కుర్చపల్లిలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామానికి చెందిన బుర్ర రమేష్ అనే గీత కార్మికుడిగా తీవ్ర గాయాలు అయ్యాయి. వృత్తిలో భాగంగా తాటిచెట్టుపైకి ఎక్కిన రమేష్ శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. ఈఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, పక్కటెముకలు విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
