పర్యావరణ పరిరక్షణకు సైకిల్ ర్యాలి..

పర్యావరణ పరిరక్షణకు సైకిల్ ర్యాలి..

డూండీ రాకేష్ ఆధ్వర్యంలో విద్యాధరపురంలో నిర్వహణ
భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, పర్యావరణ ప్రేమికులు
కాలుష్య నియంత్రణకు సైకిల్ వినియోగం పెంచాలని పిలుపు
పచ్చదనం పెంపుదలకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి

భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో శుక్రవారం నిర్వహించిన సైకిల్ ర్యాలీ విశేష స్పందన పొందింది. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని ఆయన కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. డూండీ రాకేష్ కార్యాలయం నుంచి చర్చి సెంటర్, శివాలయం సెంటర్ మీదుగా స్వాతి థియేటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, పర్యావరణ ప్రేమికులు పాల్గొని ఉత్సాహంగా ముందుకు సాగారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, చెట్ల పెంపకం, ఇంధన పొదుపు వంటి అంశాలపై చర్చించారు. వాహనాల వినియోగాన్ని తగ్గించి సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని నాయకులు పేర్కొన్నారు. డూండీ రాకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న పర్యావరణ హిత కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) సూచనల మేరకు ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సోలాంకి రాజు, సత్యనారాయణ, శాప్ డైరెక్టర్ సంతోష్, విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు మైలవరపు దుర్గారావు, నూకల నాగేశ్వరరావు, పేరం నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పల్లిపోగు ప్రసాద్, ఐటీడీపీ ప్రతినిధి సతీష్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు వక్కలగడ్డ పవన్‌కుమార్, తెలుగు యువత అధ్యక్షుడు ఆర్. మాధవ్, బీసీ సంఘం అధ్యక్షుడు ఎం. శివాజీ, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు ఇందుకూరి యువరాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply