కాలిన‌డ‌క‌న క‌లెక్ట‌ర్…

కాలిన‌డ‌క‌న క‌లెక్ట‌ర్…

ఒంగోలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా పరిపాలన అధికారిగా ఉన్న కలెక్టర్… పర్యావరణ పరిరక్షణలోనూ స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం భవనంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ పి. రాజాబాబు నడుచుకుంటూ వచ్చారు. ఆఫీసు, మార్కెట్, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు. వారంలో కనీసం ఒకసారైనా ఈ విధంగా నడుచుకుంటూ, లేదా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. దీనివలన గణనీయమైన స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారవుతామని కలెక్టర్ అన్నారు.

Leave a Reply