ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల బ్రోచర్ ఆవిష్కరణ
ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల బ్రోచర్ ఆవిష్కరణ
తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ:
చైతన్య సారస్వత పరిషత్ చైర్మన్, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణ రాజు, చైతన్య రాజు సౌజన్యంతో శ్రీశ్రీ కళావేదిక సీఈవో కళారత్న డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో రాజమహేంద్రవరం (రాజమండ్రి)లోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల బ్రోచర్‌ను బుధవారం ఆవిష్కరించారు.
శ్రీశ్రీ కళావేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్మడి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో గణేష్, తహసీల్దార్ గడిల శ్రీనివాస్, డీఎస్పీ కృష్ణకిషోర్, మున్సిపల్ కమిషనర్ వక్కాల శ్యాంసుందర్ చేతుల మీదుగా బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్య వికాసానికి ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు వేదికగా నిలుస్తాయని అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, రచయితలు వేలాదిమంది ఈ మహాసభల్లో పాల్గొంటారని తెలిపారు.
తెలుగు భాషా వైభవం, సంస్కృతి, సాహిత్య సంపదను భావితరాలకు చేరవేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే. పూర్ణేందర్ రెడ్డి, సీఐ జి. గణేష్, ఎస్ఐ కే. మహేందర్ రెడ్డి, కవులు ఇమ్మడి రాంబాబు, నాల్లం శ్రీనివాస్, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

