సోమశిలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

సోమశిలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ:

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం సోమశిలలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.

సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో సోమశిల హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు.

అనంతరం ముఖ్యమంత్రి సోమశిలలోని మృగవాని అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మెగా రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, జూపల్లి అరుణ్, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరైనట్లు సమాచారం.

Leave a Reply