ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్‌గా చల్ల వాసుదేవరెడ్డి బాధ్యతల స్వీకరణ

ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్‌గా చల్ల వాసుదేవరెడ్డి బాధ్యతల స్వీకరణ

కాజీపేట, ఆంధ్రప్రభ:

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా కాజీపేటకు చెందిన చల్ల వాసుదేవరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మార్కెట్ డైరెక్టర్‌గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామ్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంకతో పాటు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తూ రైతులు, వ్యాపారుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తానని చల్ల వాసుదేవరెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply