ఎస్ఎన్ఎంసి ఉర్దూ గర్ల్స్ హైస్కూల్లో పిల్లలను చేర్పించండి

ఎస్ఎన్ఎంసి ఉర్దూ గర్ల్స్ హైస్కూల్లో పిల్లలను చేర్పించండి

హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు డి. రత్నకుమారి ఆధ్వర్యంలో ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ ర్యాలీ

భవానిపురం, ఆంధ్రప్రభ : చక్కటి విద్యా బోధన కోసం పిల్లలను వించిపేటలోని ఎస్ ఎన్ ఎం సి ఉర్దూ గర్ల్స్ హై స్కూల్ లో చేర్పించాలని కోరుతూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు డి. రత్నకుమారి ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయులు వించిపేటలోని పలు ప్రాంతాల్లో ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారి మాట్లాడుతూ తమ పాఠశాలలో, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతూ మండుటెండల్లో సైతం తమ ఉపాధ్యాయ బృందంతో ఇంటింటికి తిరుగుతూ ఈ ప్రత్యేక ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు.

ఉర్దూ ఇంగ్లీష్ మీడియంలలో వేరువేరుగా ప్రతి సబ్జెక్టులో ఉపాధ్యాయులను కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇటీవలి టెన్త్ పరీక్షల్లో తమ విద్యార్థులు 81% ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. టెన్త్ పరీక్షల్లో 600 మార్కులకు గాను అబ్దుల్ అలియా 556 మార్కులు, రబియా షరీఫ్ 549 మార్కులు, ఎండి హజర 548 మార్కులు, దిబియా 534 మార్కులు, ఎండి సఫా బేగం 518 మార్కులు, షాదియ ఆఫ్రిన్ 504 మార్కులు సాధించారని ఆమె వివరించారు. తమ పాఠశాలలో చేరిన ప్రతి బిడ్డకు తల్లికి వందనం 15 వేల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు.

అలాగే పిల్లల చదువుకు ఎటువంటి ఫీజులు లేవన్నారు. స్కూల్ బ్యాగ్ ఉచితంగా ఇస్తామని, మూడు జతల యూనిఫామ్ ఉచితమని, అలాగే షూస్ ఉచితమని, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఉచితంగా అందజేస్తామని చెప్పారు. అలాగే ఎస్ ఎన్ ఎం సి మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రైమరీ విద్యార్థులను చేర్పించాలని ఆమె కోరారు. ఈ ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ ర్యాలీలో హైస్కూల్ ఉపాధ్యాయులు నస్రిన్ జహాన్, పి. వెంకట సుబ్బారావు, జి. శ్రీనివాసరావు, షేక్ కరిముల్లా, ఇస్రాత్ బేగం, పర్వీన్ సుల్తానా, ఎస్ ఎన్ ఎం సి మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఎండి. గౌసియా సుల్తాన్, టీచర్ రసీలా రబాబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply