రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

  • రెండు ద్విచక్ర వాహనాలు ఢీ,
  • ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలం కన్నాపూర్ గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం, రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో మండలంలోని వకీల్‌నగర్ గ్రామానికి చెందిన కొమురె గణేష్ (18) అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ప్రమాదంలో కన్నాపూర్ గ్రామానికి చెందిన అగ్గిమల్ల మహేందర్, చిలువేరి హరీష్, వకీల్‌నగర్ గ్రామానికి చెందిన దేశినేని అజయ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కడెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply