శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు

22 రోజులకు హుండీ లెక్కింపు.. బంగారం, వెండి కానుకలు సమర్పించిన భక్తులు

మంత్రాలయం, ఆంధ్రప్రభ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.4,35,25,136 వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్‌.కే. శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.

22 రోజులకుగాను హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన హుండీ ఆదాయంలో కరెన్సీ రూపంలో రూ.4,19,97,861, నాణేల రూపంలో రూ.15,27,275 వచ్చినట్లు తెలిపారు. మొత్తం నగదు ఆదాయం రూ.4,35,25,136గా నమోదైందన్నారు.

అదేవిధంగా భక్తులు బంగారం 46 గ్రాముల 100 మిల్లీ గ్రాములు, వెండి 750 గ్రాముల 600 మిల్లీ గ్రాములు సమర్పించినట్లు మఠం మేనేజర్ తెలిపారు. హుండీ లెక్కింపు సమయంలో జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం ఏఏఓ మాధవ శెట్టి, వెంకటేష్ జోషి, మఠం సిబ్బంది, భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply