ఓటరు జాబితా సవరణపై వసంత దిశానిర్దేశం

ఓటరు జాబితా సవరణపై వసంత దిశానిర్దేశం

గొల్లపూడిలో టీడీపీ యూనిట్ల సమావేశం..
ఇంటింటికీ వెళ్లి జాబితా పరిశీలించాలని సూచన

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం యూనిట్ల సమావేశం జరిగింది. క్లస్టర్ 11 పరిధిలోని యూనిట్ 52, 53ల టీడీపీ నేతలు, కార్యకర్తలతో మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు సమావేశమయ్యారు.ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ఎమ్మెల్యే వసంత నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్పించాలని సూచించారు.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. డూప్లికేట్ ఓట్లు, మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.క్లస్టర్, యూనిట్ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించాలని ఎమ్మెల్యే వసంత సూచించారు. బీఎల్ఏలతో సమన్వయం చేసుకుని పారదర్శకంగా పనిచేయాలని కోరారు.

టీడీపీ బలమైన బూత్ కమిటీలే పార్టీకి పునాదులని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడటం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు.క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలకు ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సలహాలు, సూచనలను ఎమ్మెల్యే స్వీకరించారు.ఈ సమావేశంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply