శరీర దృఢత్వానికి సైక్లింగ్ ఎంతో మేలు..

శరీర దృఢత్వానికి సైక్లింగ్ ఎంతో మేలు..

  • 63 ఏళ్ల వయసులో సైకిల్ యే నా వెహికల్ అంటున్న ప్రభాకర్

నర్సంపేట, ఆంధ్రప్రభ : శరీర దృఢత్వానికి సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని పర్యావరణ ప్రేమికులు బెజ్జంకి ప్రభాకర్ తెలిపారు. 63 ఏళ్ల నుండి సైకిల్ తొక్కుతూ వేల కిలోమీట ర్లు ప్రయాణించినట్లు చెప్పారు. నర్సంపేట పట్టణానికి చెందిన స్వయంకృషి స్వచ్చంధ సంస్థ నిర్వాహ కులు, పర్యావరణ ప్రేమికులు బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుచు ఆరోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జూన్, 3 తేదీన ప్రపంచ వ్యాప్తంగా సైకిల్ దినోత్స వాన్ని జరుపుకుంటారని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడా నికి, శారీరక దృఢత్వానికి సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని, ప్రతీ రోజు సైకిల్ వాడకం ద్వారా గుండె ఆరోగ్యం గా ఉండడంతో పాటు ఇంధన ఖర్చులు తప్పుతాయ న్నారు.

కాలుష్యరహిత సమాజం కోసం ఎప్పుడూ సైకిల్ వాడకాన్ని సమాజం లోని ప్రతీ ఒక్కరు అలవాటు చేసుకోవాలని కోరారు.చిన్న తనంలో ప్రతీ ఒక్కరికీ సైకిల్ తో విడదీయరాని అనుబంధం ఉంటుందన్నారు. సైకిల్ నేర్చుకునేవారు కాంచి, సీటు, క్యారెల్ పైన పడుతూ లేస్తూ సైకిల్ తొక్కిన జ్ఞాపకాలు మర్చిపోలేమని జ్ఞాపకాల ను ఆయన గుర్తు చేసుకున్నారు.సైకిల్ పైన స్కూల్ కు వెళ్లడం ఒక గొప్ప అనుభూతి అన్నారు. కాలం మారినా సైకిల్ జ్ఞాపకాలు మాత్రం మర్చిపోలేమన్నారు.తాను ఇప్పటికీ 63సంవత్సరాల వయస్సులో కూడా ఖానాపురం, చెన్నారావు పేట, నర్సంపేట మండలాల చుట్టు ప్రక్క గ్రామాలకు స్వచ్చంధ సేవా కార్యక్రమాల కొరకు సైకిల్ పైనే వెళతానని, సైకిలే నా వెహికల్ అన్నారు.

Leave a Reply