కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడాలి..

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడాలి..

  • కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి

వేల్పూర్, ఆంధ్రప్రభ : మండల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కోసం పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి సూచించారు. బుధవారం వేల్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ని మండల అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి సన్మానించారు.అనంతరం మండల అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడు నియమించినందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగాకాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ మండల అలాగే కాంగ్రెస్ పార్టీ సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తూ అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉండి వారికి కావాల్సిన సహాయం అందిస్తూ మండలంలో చైతన్యం తీసుకువచ్చి మండలం ప్రజలను చైతన్యవంతులు అనే విధంగా మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ యూత్ అధ్యక్షుడు మజీద్,పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply