కుంటాల నూతన ఎంపీవోగా శోభన బాధ్యతలు
కుంటాల నూతన ఎంపీవోగా శోభన బాధ్యతలు
బదిలీలపై వచ్చిన పంచాయతీ కార్యదర్శుల బాధ్యతల స్వీకరణ
కుంటాల, ఆంధ్రప్రభ: కుంటాల నూతన ఎంపీవోగా శోభన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎంపీవో ఎం.ఏ. అబ్దుల్ రహీం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి బదిలీపై వెళ్లడంతో, ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండల ఎంపీవోగా పనిచేసిన శోభన కుంటాలకు బదిలీపై వచ్చారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంపీవో శోభన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇక పెంచికల్‌పాడు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సారిక వెంకూర్‌కు బదిలీపై వెళ్లగా, ఆమె స్థానంలో భాగ్యను నియమించారు. లింబా కే పంచాయతీ కార్యదర్శిగా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అక్కడ పనిచేసిన గంగాప్రసాద్ లోకేశ్వరానికి బదిలీపై వెళ్లారు.
అందకూర్ పంచాయతీ కార్యదర్శిగా భోజన్నను నియమించారు. ఇక్కడ పనిచేసిన రమ్యను పెంబి మండలానికి బదిలీ చేశారు. అదే విధంగా అంబకంటి తండా పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సతీష్‌ను లోకేశ్వరం మండలం పుష్పూర్‌కు బదిలీ చేయగా, ఆయన స్థానంలో కరన్‌ను నియమించారు.
కల్లూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన భోజన్నను భైంసా మండలం ఇలేగాంకు బదిలీ చేయగా, ఆ స్థానంలో మాలతిని నియమించారు. బదిలీలపై వచ్చిన పంచాయతీ కార్యదర్శులు కూడా తమ తమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన ఎంపీవో శోభనతో పాటు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిశారు.
