తొర్రూరు మండల ఉపసర్పంచ్‌ల నూతన కమిటీ ఎన్నిక

తొర్రూరు మండల ఉపసర్పంచ్‌ల నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా అల్లంనేని అనిల్ రావు ఏకగ్రీవం

తొర్రూరు, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు తొర్రూరు మండల ఉపసర్పంచ్‌ల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మాటేడు గ్రామంలో ఉపసర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీకటి కరుణాకర్ అధ్యక్షతన ఈ ఎన్నికలు నిర్వహించారు.తొర్రూరు మండల ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా వెలికట్ట గ్రామానికి చెందిన అల్లంనేని అనిల్ రావు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కానాపురం గ్రామానికి చెందిన బచ్చలి లక్ష్మణ్‌ను ఎన్నుకున్నారు.

ఉపాధ్యక్షులుగా గుర్తూరు గ్రామానికి చెందిన పంజాల మహేష్, చీకటాయపాలెం గ్రామానికి చెందిన పోడకంటి సరస్వతి శేఖర్, చర్లపాలెం గ్రామానికి చెందిన జినుగ రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా మడిపల్లి గ్రామానికి చెందిన మనిషా ఉపేందర్ రెడ్డి, అధికార ప్రతినిధిగా కర్కాల గ్రామానికి చెందిన ఎర్ర సమత హరీష్, సలహాదారిగా కంటాయపాలెం గ్రామానికి చెందిన జితేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన తొర్రూరు మండల ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు అల్లంనేని అనిల్ రావు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఉపసర్పంచ్‌లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఉపసర్పంచ్‌ల సంఘంలో ఎవరికైనా సమస్య ఎదురైతే ముందుండి పరిష్కారం కోసం పోరాడుతానని చెప్పారు. హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు దీకొండ సుధాకర్, కొండ సతీష్, ఏనుగంటి మురళి, జాటోత్ సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply