పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించి భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.

ప్రపంచ పర్యావరణ వారోత్సవాల సందర్భంగా సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో “పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత – మన భవిష్యత్తు” అనే సందేశంతో రూపొందించిన పోస్టర్లు, జ్యూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పర్యావరణానికి హాని కలిగించే చర్యలను ఎవరూ చేపట్టకూడదని సూచించారు.

పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్, క్యారీ బ్యాగుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇన్‌చార్జ్ డీఆర్‌వో ఎల్. దేవకీదేవి, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఈఈ ఏ. రామచంద్రమూర్తి, సహాయక పర్యావరణ ఇంజినీర్లు కె. సంధ్య, ఎస్. రమేష్, ఇతర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply